Ravi Teja, Balakrishna: టాలీవుడ్ దసరా బాక్సాఫీస్ ఫైట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. పరిస్థితులు అన్ని కూడా సర్దుకోవడంతో బడా హీరోలు మిడియం హీరోలు అని తేడా లేకుండా విడుదల తేదీలతో ఫైట్ చేయబోతున్నారు. ఇక దసరా సమయానికి కూడా ఓ రేంజ్ లో బాక్సాఫీస్ ఫైట్ ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా మాస్ మహా రాజా రవితేజ నటించిన రావణాసుర దసర టైమ్ లో రావడానికి సిద్ధమైంది. ఇక అదే సమయంలో నందమూరి బాలకృష్ణ NBK 107 కూడా రానుంది.

ఈ రెండు సినిమాలతో పాటు నాని నటించిన దసరా సినిమ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలకృష్ణ రవితేజ సినిమాలు దసరా కంటే ముందే విడుదల అయ్యే అవకాశం ఉందట. రవితేజ నటించిన రావణాసుర సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఒకవైపు పవర్ఫుల్ విలన్ షేడ్స్ లో కనిపిస్తూనే మరోవైపు ఒక మంచి వ్యక్తిగా కనిపిస్తాడట.

తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవుతుందని పోటీ ఎంత ఉన్నా దసరా సమయానికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ 107వ సినిమాను గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో సినిమాను తెరకెక్కించే గోపిచంద్ క్రాక్ అనంతరం డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

అలాగే ఈ సినిమాకి అన్నగారు అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు దసర సమయానికి రానున్న నాని దసర సినిమా పక్కా మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని చాలా రఫ్ గా కనిపించబోతున్నాడు. మరి ఈసారి దసరా బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus