ఈ ఒక్క ఫొటోతో మళ్ళీ వార్తల్లోకెక్కిన హన్సిక..!

  • January 28, 2020 / 06:57 PM IST

తెలుగు, తమిళ భాషల్లో హన్సిక కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా.. ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కుతుంది మన పూరి భామ. ఇప్పుడు తన మాజీ ప్రియుడుతో మరోసారి దొరికేసింది. కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ప్లే బాయ్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటాడు హీరో శింబు. అప్పటికప్పుడు పాపులర్ అయ్యే హీరోయిన్లందరినీ బుట్టలో పడేసుకోవడంలో ఈ హీరోకి సరిలేరు ఎవ్వరూ.. ! ఇక గతంలో నయన తార, త్రిష అబ్బో చెప్పుకుంటే ఈ లిస్ట్ పెద్దదే. ఇదే క్రమంలో హన్సికతో కూడా ప్రేమాయణం నడిపాడు. తరువాత బ్రేకప్ చెప్పేసుకున్నారు అనుకోండి. ప్రస్తుతం మరో క్రేజీ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్న శింబు.. ఇప్పుడు సడెన్ గా హన్సిక తో కనిపించి షాక్ ఇచ్చాడు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ చిత్రానికి ‘మహా’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సినిమాలో రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కువ గానే ఉంటాయని తెలుస్తుంది. ఇందుకు సంబందించిన కొన్ని ఫోటోలు లీక్ అవ్వడంతో కోలీవుడ్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫొటోలతో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసిందనే చెప్పాలి.


డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus