Ram, Srinu Vaitla: ‘ఢీ’ కాంబో వర్కౌట్ కాలేదు.. ‘రెడీ’ కాంబో వర్కౌట్ అవుతుందా ..?

స్టార్‌ డైరక్టర్‌గా ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల. కామెడీ సినిమాలకు యాక్షన్ ను మిక్స్ చేసి హిట్లు కొట్టడంలో శ్రీను వైట్ల కి ఎవరూ సాటిలేరు అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈయన మీమ్స్ తోనే ట్రెండింగ్లో నిలుస్తున్నారు అనుకుంటే.. తాజాగా విడాకుల టాపిక్ తో కూడా ట్రెండింగ్ లో నిలిచారు. శ్రీనువైట్ల ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్.. రెండూ డిస్టర్బ్ అయ్యాయి.

ఆయన భార్య రూప వైట్ల విడాకుల కోసం ఇటీవల నాంపల్లి కోర్టు మెట్లెక్కినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు కానీ.. మరోపక్క శ్రీను వైట్ల అవకాశాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. కొన్ని ప్రొడక్షన్ హౌస్ లో ఇతనికి అడ్వాన్స్ లు ఇచ్చాయి. సినిమా నిర్మించడానికి కూడా రెడీగా ఉన్నాయి. కానీ శ్రీను వైట్లతో సినిమా అంటే హీరోలు కాస్త దూరంగా ఉంటున్నారు.

ఏ స్క్రిప్ట్ తోనూ కూడా శ్రీను వైట్ల హీరోలను, నిర్మాతలను ఇంప్రెస్ చేయలేకపోతున్నారు అని తెలుస్తుంది. చివరికి విష్ణు కూడా శ్రీను వైట్ల మూవీని పక్కన పెట్టేసాడని ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా రామ్.. శ్రీను వైట్లకి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యనే ‘ది వారియర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్.. తన తర్వాతి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు. అటు తర్వాత హరీష్ శంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లు కూడా రెడీగా ఉన్నారు.

మరి అలాంటప్పుడు శ్రీను వైట్లకి రామ్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టా? వీరిద్దరి కాంబినేషన్లో ‘రెడీ’ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ శ్రీను వైట్ల ఇప్పుడు ఏమాత్రం ఫామ్లో లేడు. ఇలాంటి టైంలో రామ్.. సినిమా చేయడానికి ఓకె చెబితే అతని కెరీర్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus