ఒకప్పటి తమిళ హీరో మరియు డి.ఎం.డి.కె అధ్యక్షుడు అయిన విజయ్ కాంత్..కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో కాస్త పర్వాలేదు అని చెన్నై మీడియా వర్గాలకు ఆయన తెలిపారు కానీ మళ్ళీ ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అయితే విజయ్ కాంత్ మరింత బలహీనంగా తయారయ్యారు.మధ్యలో కరోనా భారిన కూడా పడి కోలుకున్నారు.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆయన్ని సింగపూర్, అమెరికా వంటి దేశాలకు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు ఆయన కుటుంబ సభ్యులు.
ఈ ట్రీట్మెంట్ వర్కౌట్ అయ్యింది ఇక ఎలాంటి ప్రమాదం లేదు అని వారు సంతోషించేలోపే మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఆయన ఆరోగ్యం బాలేని కారణంగా ఆయన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసారని తెలుస్తుంది. ఇక పార్టీ బాధ్యతలను విజయ్ కాంత్ తన భార్య మరియు కోశాధికారి అయిన ప్రేమలతకు అప్పగించడం జరిగింది.ఆగష్ట్ 25న ఆయన పుట్టినరోజు వేడుకలను కూడా నిరాడంబరంగా నిర్వహించారు కుటుంబసభ్యులు. ఆ వేడుకల్లో కూడా ఆయన చాలా నీరసంగా కనిపించారు.
కొన్ని రాజకీయ సమావేశాల్లో ఆయన సరిగ్గా మాట్లాడలేక ఇబ్బంది పడుతున్న సందర్భాలను కూడా మనం చూసాం. నిలబడే శక్తి కూడా ఆయనకి లేకపోవడం గమనార్హం.ఆయన వయసు 69 సంవత్సరాలు కావడంతో.. ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా విజయ్ కాంత్ కోలుకోవాలని వారు పూజలు నిర్వహిస్తుండడం విశేషం.మరోపక్క విజయ్ కాంత్ కుటుంబ సభ్యులు మళ్ళీ ఆయన్ని ట్రీట్మెంట్ నిమిత్తం విదేశాలకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!