Vishal: ‘మార్క్‌ ఆంటోనీ’ షూటింగ్‌లో ప్రమాదం!

Advertisement

ప్రముఖ కథానాయకుడు విశాల్‌ మరోసారి గాయపడ్డారు. ఆయన కొత్త సినిమా ‘మార్క్‌ ఆంటోనీ’ చిత్రీకరణ సందర్భంగా గాయాలైనట్లు చిత్రబృందం తెలిపింది. సినిమాలోని కీలక ఫైట్‌ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని టీమ్‌ చెబుతోంది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విశాల్‌కు వెంటనే ప్రథమ చికిత్స చేశామని, షూటింగ్‌ నుండి బ్రేక్‌ తీసుకొని రెస్ట్‌ తీసుకుంటున్నారని విశాల్‌ సన్నిహితులు చెబుతున్నారు.

విశాల్‌ గాయపడినట్లు సమాచారం బయటకు రావడంతో సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్‌ వెంటనే కోలుకోవాలని, తిరిగి చిత్రీకరణ ఎప్పటిలాగే ప్రారంభించాలని సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. సినిమా షూటింగ్‌ల్లో విశాల్‌ గాయపడటం ఇదే తొలిసారి కాదు. ఆయన ఇటీవల కాలంలో చేసిన అన్ని సినిమాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. యాక్షన్‌ సీన్స్‌ వచ్చేసరికి విశాల్‌ డూప్‌ లేకుండా నటిస్తున్నాడు. ఈ క్రమంలో గాయపడి షూటింగ్‌ నిలిపేస్తున్నారు.

విశాల్‌ ఇటీవల నటించిన ‘లాఠీ’ సినిమా చిత్రీకరణలో చాలాసార్లు గాయపడ్డాడు. యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నప్పుడే ఇది జరిగింది. సినిమా షూటింగ్‌ ఆపేసి, విదేశాలకు వెళ్లి రెస్ట్‌ తీసుకొని వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే అప్పుడు కూడా గాయపడ్డాడు. ఇంత జరుగుతున్నా విశాల్‌ రిస్క్‌ చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. సినిమా మీద తనకున్న ప్యాషన్‌తో ఇలా చేస్తున్నాడని అనుకోవచ్చు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా ఉండాలి కదా అని సూచించే వాళ్లూ ఉన్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus