తాప్సి పై మళ్ళీ విరుచుకుపడ్డ కంగనా..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ‘మణికర్ణిక’ సినిమా టైములో డైరెక్టర్ క్రిష్ పై ఈమె చేసిన కామెంట్స్ ఇప్పటికీ ఎవ్వరూ మరచిపోలేరు. బాలీవుడ్ స్టార్ హీరోలను మాత్రమే కాకుండా స్టార్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ వంటి వారి పై కూడా ఈమె వివాదాస్పద కామెంట్లు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓ సినిమా ప్రమోషన్లో అయితే జర్నలిస్ట్ పైనే నోరు జారింది కంగనా.

సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ‘నెపోటిజం’ అనే ఇష్యూ మొదలైనప్పటి నుండీ.. కంగనా కు అలాగే మరో హీరోయిన్ తాప్సికి మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో బాలీవుడ్ సెలబ్రిటీల పై కంగనా ప్రశంసలు కురిపించిన వీడియోలను తాప్సి షేర్ చేసింది. ‘బాలీవుడ్ లో నెపోటిజం ఉంది అని ఫైట్ చేస్తున్న కంగనా.. గతంలో స్టార్ల పై ప్రశంసలు ఎందుకు కురిపించినట్టో’ అంటూ తాప్సి కామెంట్ చేసింది. అప్పటి నుండీ కంగనా.. తాప్సిని టార్గెట్ చేసింది.

మొన్నటికి మొన్న ‘తాప్సి ఓ బి గ్రేడ్ హీరోయిన్’ అంటూ విమర్శించిన కంగనా ఇప్పుడు తాప్సికి ఓ సవాలు విసిరింది.’నా కెరీర్ లో ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్ ‘ ‘మణికర్ణిక’ వంటి సోలో హిట్ సినిమాలు ఉన్నాయి. నువ్వు అలాంటి సోలో హిట్ ఒక్కటి కొట్టి చూపించు’ అంటూ తాప్సికి సవాలు విసిరింది కంగనా.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus