Keerthy Suresh, Suriya: కీర్తి సురేష్..కి ఇది బంపర్ ఆఫరే..!

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) , దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri)  కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకి `796 CC` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు చాలా కాలంగా టాక్ నడుస్తుంది. ఇదొక పీరియాడిక్ సినిమా. మారుతి  (Maruthi Dasari) కార్లు భారతదేశానికి దిగుమతి అవుతున్న రోజుల్లో జరిగే కథ అని అంటున్నారు. అందుకే టైటిల్ `796 CC` గా పెడుతున్నారనే టాక్ నడుస్తుంది.

Keerthy Suresh, Suriya:

దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే అధికారిక ప్రకటన రావాలి. ఇక ఈ సినిమా ప్రీ- ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సరైన హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నట్టు నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేని (Bhagyashree Borse) అనుకున్నారు.

కానీ ఆమె మరో 2 సినిమాలతో బిజీగా ఉండటంతో సంయుక్త మీనన్ ను (Samyuktha Menon) తీసుకుంటున్నట్టు టాక్ నడిచింది. కానీ అందుకు సూర్య అండ్ టీం వద్దన్నారనే టాక్ కూడా ఉంది. దీంతో కీర్తి సురేష్ ని (Keerthy Suresh) ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) తర్వాత ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో ఆమె 2 సినిమాలు చేయడానికి సైన్ చేసింది. ఆల్రెడీ ‘రంగ్ దే’ (Rang De) చేసింది. ఇప్పుడు సూర్య సినిమాలో చేయడానికి ఆమె అంగీకరించినట్టు టాక్.

కథ ప్రకారం.. ‘లక్కీ భాస్కర్’ లో (Lucky Baskhar) లానే ఇందులో కూడా హీరోయిన్ తల్లి పాత్ర చేయాలట. అందుకు కీర్తి సురేష్ వంటి నటే కరెక్ట్ అని భావించి టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సూర్య కూడా కీర్తితో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్లో ‘గ్యాంగ్’ అనే సినిమా వచ్చింది. అది సో సోగా ఆడింది.

ప్రభాస్ హీరోయిన్ ఎమోషనల్ లెటర్ వైరల్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus