Varasudu: ‘వారసుడు’ నా ‘వరిసు’నా ఏది కరెక్ట్‌?

థళపతి విజయ్‌తో సినిమా చేస్తున్నాం.. ఇది మల్టీ లింగ్వల్‌ అంటూ చాలా నెలల క్రితం ప్రకటించారు దిల్‌ రాజు. విజయ్‌ తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది అంటూ.. గొప్పగా చెప్పారు కూడా. అయితే అప్పుడే కొంతమందికి డౌట్‌ వచ్చింది. ఇది నిజంగానే బై లింగ్వుల్‌ సినిమానా.. కాదా అని కొన్ని ప్రశ్నలు సోషల్‌ మీడియాలో వినిపించాయి. దానికి చిత్ర యూనిట్‌ డైరెక్ట్‌గా స్పందించకపోయినా.. అనధికారికంగా ఇది బైలింగ్వుల్‌ మూవీనే అని చెప్పారు. కానీ ఇప్పుడు సినిమా టీమ్‌ అధికారికంగా మరోసారి ఇది తమిళ సినిమా అని ప్రకటించింది.

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, తెలుగు నిర్మాత దిల్ రాజుతో విజయ్‌ చేస్తున్న చిత్రం ‘వారసుడు’. దీనినే ‘వరిసు’ అని తమిళంలో తీస్తున్నాం. ఈ రెండూ పారలల్‌గా తెరకెక్కుతున్నాయి అని తొలుత ప్రకటించారు. అయితే ఆ తర్వాత మొన్నీమధ్య టాలీవుడ్‌ సినిమాల బంద్‌ జరిగినప్పుడు ‘మా సినిమా ‘వరిసు’ తమిళంలో చేస్తున్నాం. అందుకే మేం షూటింగ్‌ చేసుకుంటాం’ అంటూ దిల్‌ రాజు కొత్త వాదన వినిపించారు. కానీ తెలుగు నిర్మాతల అభ్యంతరం చెప్పడంతో వెనక్కి తగ్గారు.

దీంతో దానికి ముందు విజయ్‌ చెప్పిన మాటే నిజం అని తేలిపోయింది. అంటే ‘ఇది తమిళ సినిమా.. తెలుగులోకి డబ్బింగ్‌ చేస్తాం’ అని చెప్పాడు. అప్పుడు కాదు కాదు అన్న టీమ్‌.. సినిమాల బంద్‌ సమయంలో దిల్‌ రాజు చెప్పిన మాటలతో కామ్‌ అయిపోయింది. ఇప్పుడు ఇదే మాట దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా అదే మాట అన్నారు. తాజాగా కోలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు వంశీ పైడిపల్లి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఏ భాషలో తీస్తున్నారు అనే విషయంలో చర్చ జరిగింది. అప్పుడే క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా బైలింగ్వులా? లేక తమిళ సినిమానా? అని వంశీ పైడిపల్లిని అడిగితే.. ఇది ప్రాపర్ తమిళ సినిమానే… మరో డౌట్‌ అక్కర్లేదు అని వంశీ చెప్పాడట. దీంతో ఈ సినిమా పక్కా తమిళ సినిమా.. తెలుగులో డబ్బింగ్‌ చేస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. మరి తొలుత ఎందుకు బైలింగ్వుల్‌ అని చెప్పారు అనేది తెలియాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus