సుకుమార్, మహేష్ కాంబోలో మూవీ!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మహేష్ బాబు కలయికలో మరో మూవీ రానుందా? ఆ సినిమాని 14రీల్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారా ? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు టాలీవుడ్ వర్గాల వారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ “వన్ -నేనొక్కడినే”  చేశారు. ఇది ఆర్ధికంగా విజయం సాధించకపోయినప్పటికీ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ రేంజ్ లో సినిమాని తెరకెక్కించినట్లు సుకుమార్ ప్రతిభని మెచ్చుకున్నారు. ఈ సినిమా విజయం సాదించ లేదు కాబట్టి.. మహేష్ కి ఎలాగైనా హిట్ ఇవ్వాలని సుకుమార్ కసితో ఉన్నారు. అందుకే మంచి కథని ప్రిపేర్ చేసి రీసెంట్ గా వినిపించారంట. కొత్తగా ఉండడంతో మరో సారి సాహసం చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

“వన్ -నేనొక్కడినే” నిర్మించిన 14రీల్స్ బ్యానర్ లోనే ఇది నిర్మితం కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు  కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అను నేను” సినిమాను చేస్తున్నారు. ఇది  పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ స్టోరీ. దీని తర్వాత వంశీ పైడిపల్లితో తన 25వ సినిమాను చేయనున్నారు. దీనిని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత రాజమౌళి తో మహేష్ సినిమా ఉండనుంది. ఈ మూడు సినిమాల తర్వాత “వన్ -నేనొక్కడినే” కాంబో సెట్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus