ఈ టైములో మహేష్ అంత రిస్క్ చేస్తాడా?

మహేష్ కు ఓ డిజాస్టర్ సినిమా ఇస్తే… అది ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే… మరోసారి ఆ డైరెక్టర్ జోలికి పోడు మహేష్. ‘ఖలేజా’ తరువాత త్రివిక్రమ్ తో కానీ… ‘1 నేనొక్కడినే’ తరువాత సుకుమార్ తో కానీ… ‘అతిథి’ తరువాత సురేందర్ రెడ్డి తో కానీ… ఇలా ఏ డైరెక్టర్ తోనూ మళ్ళీ సినిమా చెయ్యడానికి మహేష్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే తనకి ‘స్పైడర్’ వంటి ఆణిముత్యం ఇచ్చిన మురుగదాస్ తో మహేష్ బాబు సినిమా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. వివరాల్లోకి వెళితే… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ … విజయ్ తో సినిమా పూర్తయ్యాక…. మరో మారు మహేష్ బాబు తో సినిమా చేస్తాను అని చెప్పాడు. అందుకోసం ఓ కథ కూడా రెడీ చేసుకున్నానని త్వరలోనే మహేష్ ను కలిసి కథ వినిపిస్తాను అని కూడా చెప్పాడు.

Once again Mahesh Babu to work with Murugadoss1

అయితే ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేస్తున్న మహేష్ ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తాడు అని ఫ్యాన్స్ ఎంతో ముచ్చటపడుతున్నారు. ఇలాంటి టైం లో మురుగదాస్ తో సినిమా అంటే వాళ్ళు కూడా కంగారు పడతారు మరి. అయితే మహేష్ … అసలు మురుగదాస్ చెప్పే కథ వినడానికి అయినా టైం ఇవ్వాలి కదా…!

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus