మరోసారి మాహేష్ తో కొరటాల!

మాహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ట్ చేసిన ‘జనతాగ్యారేజ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత కొరటాల, మాహేష్ తో కలిసి పని చేయనున్నట్లుగా వెల్లడించారు.

అయితే ఈ సినిమా శ్రీమంతుడు సినిమాకు సీక్వెల్ కాదని, అలానే ఎలాంటి రీమేక్ సినిమా కాదని చెప్పారు. ఓ ఫ్రెష్ ఐడియాతో ఈ సినిమా ఉండబోతోంది. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. హీరోయిన్ ఎవరనే విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. త్వరలోనే రాబోతున్న ఈ కాంబినేషన్ పై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus