‘మహర్షి’ వాయిదా కన్ఫర్మ్.. మరి మహేష్ రియాక్షన్ ఏంటో..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న’మహర్షి’ చిత్రం రిలీజ్ ఏప్రిల్ 25 న విడుదల చేస్తున్నామని కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఆలోచనలో ఉందట. ఏప్రిల్ 13 వరకూ ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ 25 కి విడుదల చేయడం కష్టమని చిత్రబృందం భావిస్తోందట.

దీనికోసం మహేష్ ని కన్విన్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుందట. అయితే మహేష్ మాత్రం ఏప్రిల్ 25న సినిమా థియేటర్లలోకి రావాల్సిందేనని పట్టుబడుతున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే మే నెలలో విడుదలైన మహేష్ ‘నిజం’ ‘నాని’ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు డిజాస్టర్ కావడం.., మహేష్ ‘మే’ నేలని బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నాడట. ఏప్రిల్ అయితే మహేష్ కి బాగా కలిసొచ్చిన నెల. ‘పోకిరి’ ‘భరత్ అనే నేను’ చిత్రాలు మహేష్ కి మంచి హిట్ అయ్యాయి… ఒక్క ‘యువరాజు’ చిత్రం యావరేజ్ గా నిలిచింది. సో ఏప్రిల్ మహేష్ కి మినిమం గ్యారంటీ. ఆ కారణంగానే మొదట చిత్రబృందం సోషల్ మీడియాలో ఏప్రిల్ 25న రిలీజ్ అంటూ అనౌన్స్ చేసేసారు చిత్ర యూనిట్. ఇప్పుడు అయితే సినిమా వాయిదా వేయడం తప్పేలాలేదు. దీంతో ఈ విషయాన్ని మహేష్ కి చెప్పి కన్విన్స్ చేసే బాధ్యత దిల్ రాజు తీసుకున్నాడట. మరి మహేష్ దీనికి ఒప్పుకుంటాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఈ చిత్రం మే నెలలో విడుదలయ్యి సూపర్ హిట్ అయితే… మహేష్ బ్యాడ్ సెంటిమెంట్ కి బ్రేక్ పడితే చాలు అని ఫ్యాన్స్ భావిస్తున్నారట. మరి ‘మహర్షి’ చిత్రం చివరికి ఏమవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus