బాలీవుడ్ మీడియాను కెవ్వు కేక పెట్టిస్తున్న మలైకా!

బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ నెలలో దీపికా-రణ్‌వీర్ సింగ్.. వచ్చే నెలలో ప్రియాంక చోప్రా- నిక్ జోనస్‌ల వివాహం జరగనుండగా., తాజాగా మరో జంట పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న మలైకా అరోరా- అర్జున్ కపూర్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సన్నాహాలు కూడా మొదలైనట్లు సమాచారం.

కాగా మలైకా, అర్జున్ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకోవడానికి కూడా కారణం అర్జున్ అని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. ఇక గతేడాది విడాకుల తరువాత అర్జున్- మలైకాలు కలిసి పలుమార్లు కెమెరాకు చిక్కారు. మరోవైపు వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు కూడా సమాచారం. కాగా 1998లో అర్బాజ్ ఖాన్‌ను మలైకా వివాహం చేసుకుంది. దాదాపు 19 సంవత్సరాలు ఈ ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి అర్హాన్ ఖాన్(15) అనే బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus