షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన ‘కింగ్’ నాగార్జున…!

  • November 5, 2020 / 12:02 PM IST

కింగ్ నాగార్జున మొన్నటి వరకూ మనాలిలో ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్లో పాల్గొని వచ్చారు. దాంతో ఆయన హోస్ట్ చేస్తున్న’బిగ్ బాస్4′ కు కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ లోటుని ఆయన కోడలు సమంత తీర్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నాగ్ షూటింగ్ నిమిత్తం మళ్ళీ ముంబై వెళ్ళాడట. ఈసారి ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం షూటింగ్ కోసం నాగార్జున వెళ్ళినట్టు తెలుస్తుంది. బాలీవుడ్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగ్… ఆర్కియాలజిస్టుగా కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం.. నాగార్జున, రణబీర్ కపూర్, అలియా భట్, మౌనీ రాయ్ ల కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు సమాచారం. ముంబైలో 10రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో నాగార్జున పాల్గొనబోతున్నారట. అయితే ఈ వీకెండ్ ‘బిగ్ బాస్4’ ను ఎవరు హోస్ట్ చేస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే కంగారు పడాల్సిన పని లేదు. వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ కోసం నాగార్జున హైదరాబాద్ వస్తారట. ఇక ‘బిగ్ బాస్4’ కు ఆయన ఎటువంటి బ్రేక్ లు ఇవ్వబోరని తెలుస్తుంది.

ఏమైనా కరోనా విజృంభణ ఇంకా తగ్గని తరుణంలో చాలా పెద్ద హీరోలు షూటింగ్లకు రావడానికి భయపడుతుంటే.. నాగ్ మాత్రం వరుస షూటింగ్లలో పాల్గొంటుండడం అభినందించ తగ్గ విషయమే అని చెప్పాలి.ఇక ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus