ప్రభుదేవతో బ్రేకప్ అనంతరం నయనతార కెరీర్ కు బాగా హెల్ప్ అయిన సినిమాల్లో “కృష్ణం వందే జగద్గురుం” ఒకటి. ఆ సినిమాలో ఆమె నటన, గ్లామర్, స్వంత డబ్బింగ్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2012లో విడుదలైన ఆ సినిమా తర్వాత నయనతార-రాణా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. మధ్యలో వచ్చిన “ఆరంభం” సినిమాలో ఇద్దరూ కలిసి నటించినా ఆ సినిమాలో రాణా సహాయ పాత్ర పోషించాడు.
గృహం ఫేమ్ మిళిండ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామాలో రాణా పోలీస్ పాత్రలో కనిపించనుండగా.. ఈ చిత్రం ఓ కొరియన్ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళంలోనూ ఒకే టైమ్ లో విడుదల చేయాలన్నది రాణా ప్లాన్. మరి అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే.. రాణా కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యి.. ఈ ప్రొజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.