NTR30: మళ్లీ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. ఈసారి రీజన్‌ ఏంటంటే?

కారు అన్నాక బ్రేక్‌లు.. సినిమా అన్నాక లీక్‌లు చాలా కామన్‌. అయితే అలాంటి లీక్‌తో వచ్చిన కంటెంట్‌ వల్ల సోషల్‌ మీడియా షేక్‌ అయితే.. అంతకంటే ఆనందం ఏం కావాలి ఆ హీరో అభిమానులకు చెప్పండి. సినిమా రాకముందే, కనీసం ప్రచారం మొదలవ్వక ముందే డైలాగ్‌ బయటకు రావడంతో ఆనందం అదిరిపోతోంంది వారికి. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి ఆనందమే పొందుతున్నారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. అవును కొరటాల శివ దర్శకత్వంలో తారక్‌ చేస్తున్న సినిమాలోని ఓ డైలాగ్‌ బయటకొచ్చింది. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు ఫ్యాన్స్.

(NTR30) ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా నుండి మరో డైలాగ్‌ బయటకొచ్చింది. ‘‘సమయం యుద్ధాన్ని కోరినప్పుడు ప్రకృతి తన సారథిని పంపిస్తుంది. ప్రకృతి కోరలను బలిచ్చే ధీరుని ప్రచండ దాడికి సిద్ధం’’ అంటూ ఓ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ డైలాగ్‌ వింటూ, వినిపిస్తూ ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

విలన్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ను ఉద్దేశించి తారక్‌ ఈ డైలాగ్‌ చెబుతాడు అనేది స్పష్టం. అయితే, అంతకుముందే ఒక డైలాగ్‌ లీక్‌ అయిన విషయం తెలిసిందే. ‘‘యుద్ధం తథ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు” అనే డైలాగ్ సినిమా సెట్స్‌ నుండి బయటకు వచ్చింది. అప్పుడు కూడా ఆ డైలాగ్‌ వైరల్‌ అయ్యింది. ఇప్పుడు కూడా సేమ్‌ సీన్‌. దీంతో సినిమా మీద బజ్‌ అమాంతం పెరుగుతోంది అని చెప్పాలి.

ఇన్నాళ్ల ఆలస్యానికి మందులా ఈ లీక్‌లు పని చేస్తున్నాయని చెప్పొచ్చు. మరి సినిమా వచ్చేలోపు ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయో చూడాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసి ప్రత్యేక దీవి – సముద్రం సెట్‌లో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. త్వరలో టీమ్‌ నుండి సర్‌ప్రైజ్‌ ఉండబోతోంది అని సమాచారం. అయితే అదేంటి అనేది తెలియాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus