తెరపై మరోసారి పవన్ , వెంకీలు..?

గతంలో పవన్ కల్యాణ్, వెంకటేష్ లు కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. ఓ మోస్తారు విజయాన్ని సొంతం చేసుకొంది. అయితే పవన్ ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు డాలీతో ఓ సినిమా చేస్తానని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం పవన్, డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

అలానే వెంకటేష్ తో కలిసి మరోసారి నటించాలని పవన్ భావించాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు త్రివిక్రమ్ తో చెప్పాడు. వెంకటేష్ కామెడీ టైమింగ్ అంటే త్రివిక్రమ్ కు బాగా ఇష్టం. గతంలో ఆయనతో కలిసి త్రివిక్రమ్ సినిమాలు చేశాడ. దీంతో పవన్, వెంకీల కాంబినేషన్ లో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయ్యాడు. ఓ కథను కూడా సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus