Prabhas , Anushka: ప్రభాస్ అనుష్క కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు.. కానీ?

ప్రభాస్ (Prabhas)  అనుష్క (Anushka Shetty) కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన బిల్లా (Billa), మిర్చి (Mirchi) , బాహుబలి1 (Baahubali) , బాహుబలి2 (Baahubali2) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సంచలన విజయం సాధించాయి. ప్రభాస్ ప్రస్తుతం వేగంగా సినిమాల్లో నటిస్తుండగా అనుష్క మాత్రం నిదానంగా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అనుష్క తాజాగా చేసిన ఒక పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. బాహుబలి సినిమాకు సంబంధించిన తన పిక్ ను అనుష్క శెట్టి ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది.

దేవసేన లుక్ లో ఉన్న ఫోటోను అనుష్క పంచుకోవడంతో ప్రభాస్ అనుష్క కాంబోలో మరో సినిమా రాబోతుందా అనే చర్చ మొదలైంది. త్వరలో ప్రభాస్ హీరోగా మరో రెండు కొత్త సినిమాలు మొదలుకానున్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాలో అయినా అనుష్క హీరోయిన్ గా నటిస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. అయితే అనుష్క వైపు నుంచి క్లారిటీ ఇస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.

ప్రభాస్ అనుష్క జోడీని తెరపై చూడాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతం అనుష్క ఒక మలయాళ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty) సినిమాతో అనుష్క హిట్ అందుకున్నారు. అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే అనుష్క మనస్సులో ఏముందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ప్రభాస్ సైతం ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎంతోమంది హీరోలకు అనుష్క ఫేవరెట్ హీరోయిన్ కావడం గమనార్హం. ఇప్పటికైతే ప్రభాస్ అనుష్క కాంబో వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus