క్లారిటీ మిస్సయితే కష్టం డార్లింగ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుమారు రెండేళ్ళ తరువాత ‘సాహో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కాని కలెక్షన్ల విషయంలో మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్లాప్ టాక్ తో కూడా ఈ చిత్రం 200 కోట్ల పైన షేర్ రాబట్టింది.

కొన్ని మైనస్ పాయింట్ లను కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే.. ఈ చిత్రం ఇంకా కలెక్ట్ చేసేది అనడంలో ఆశ్చర్యం లేదు. ఆ మైనస్ లలో ఒకటి సంగీతం. ‘సాహో’ పాటలు చాలా వరకూ బాలీవుడ్ స్టైల్ లో ఉంటాయి. ముందుగా ఈ చిత్రానికి శంకర్- ఇషాన్- లాయ్‌ను సంగీత దర్శకులుగా అనుకున్నారు. కానీ ఎందుకో తరువాత వాళ్ళు తప్పుకున్నారు. దీంతో ఓ ముగ్గురు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లతో సంగీతం మమ అనిపించేసారు. ఇదంతా సినిమా మరో మూడు నెలల్లో పూర్తవుతుంది అన్న టైములో చేసారట. ఇప్పుడు ప్రభాస్ 20 విషయానికి వద్దాం..! ఈ ప్రాజెక్ట్ కు ‘సైరా’ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అన్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సినిమా షూటింగ్ అప్పుడే 25 శాతం పూర్తయిపోయింది. మరి ప్రభాస్ పుట్టిన రోజుకి అయినా నిర్మాతలు ‘యూవి క్రియేషన్స్’ ‘గోపికృష్ణా మూవీస్’ వారు ప్రకటిస్తారేమో చూడాలి..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus