బాహుబలి తరువాత ప్రభాస్ మార్కెట్ బాగా పెరిగింది. ముఖ్యంగా హిందీలో సైతం ఆయన సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లు ఈజీగా రాబడుతున్నాయి. సాహో హిందీలో 150కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అనూహ్యంగా తెలుగుకు మించిన ఆదరణ హిందీ వెర్షన్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మూవీ అంటే నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. సాహో ఫలితం తర్వాత బడ్జెట్ విషయంలో పొదుపుగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ దానిని ఫాలో అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
జాన్(వర్కింగ్ టైటిల్) సినిమా బడ్జెట్ హద్దులు దాటిపోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 150కోట్ల బడ్జెట్ లోపు ముగించాలని మొదట నిర్ణయించుకున్నారు. కాగా ఇటీవల పూర్తయిన ఓ ఛేజింగ్ సన్నివేశంలో ఒక్క షాట్ కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టారట. విదేశీ స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో 150మంది ఫైటర్స్ ఇందులో పాల్గొన్నారట. ఇలా మొదట పెట్టుకున్న బడ్జెట్ హద్దులు చెరిగిపోతున్నాయట. ఈ నేపథ్యంలో సాహో నేర్పిన గుణపాఠం ప్రభాస్ టీమ్ మర్చిపోయినట్లున్నారని అనిపిస్తుంది. సాహో మాదిరి మరలా తాజా చిత్ర బడ్జెట్ పెంచేస్తూ పోతున్నారు. ఈ సినిమా కూడా మరలా అటు ఇటూ అయితే భారీ నష్టాలు చవిచూడాల్సివస్తుంది. ప్రభాస్ కున్న మార్కెట్ రీత్యా తక్కువ బడ్జెట్ తో మూవీ తీస్తే సినిమా ఫలితం ఎలా వచ్చినా స్వల్ప లాభాలతో బయటపడవచ్చు.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!