ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ ట్రోలింగ్ కి గురైన వింక్ బ్యూటీ ప్రియా

సరిగ్గా ఏడాది క్రితం ఈ టైమ్ కి ప్రియా ప్రకాష్ వారియర్ అంటే ఒక బ్రాండ్. ఆమె కన్నుగీటితే చాలు కోట్ల లైకులు, లక్షల షేర్లు, వేల కామెంట్స్. ఇదంతా చూసి ఆమె పెద్ద హీరోయిన్ అయిపోతుందనుకున్నారు అందరూ. మొదటి సినిమా విడుదలవ్వకముందే సైన్ చేసుకోవాలని కొందరు కంగారుపడితే.. ఇంకొందరు సినిమా విడుదలయ్యాక చూద్దాం ఏమవుతుందో అని వెయిట్ చేశారు. కట్ చేస్తే.. అమ్మడు నటించిన మొదటి చిత్రం “లవర్స్ డే” విడుదలై. వింక్ బ్యూటీని చూడడం కోసం థియేటర్లకు వచ్చినవాళ్ళందరూ షాక్ అయ్యి షేకైపోయారు. అసలు ప్రియా సినిమాలో మెయిన్ హీరోయిన్ కాదని గ్రహించి సైలెంట్ అయిపోయారు.

అప్పట్నుంచి అమ్మడిని ఏదో ఒక రకంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా అమ్మడు మరోమారు ట్రోలింగ్ కు గురైంది. ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవల స్నేహా ఉల్లాల్ తో కలిసి ఒక యాడ్ ఫిలిమ్ చేసింది ఒక ప్రయివేట్ కంపెనీ కోసం. ఆ కంపెనీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను పోస్ట్ చేస్తూ ఒక మెసేజ్ ను పోస్ట్ చేసింది. అందులో చాలా తప్పులున్నాయి దాంతో జనాలు ఆమెను ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆమె అప్పటికీ పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ.. జనాలు స్క్రీన్ షాట్ తీసుకొని మరీ అమ్మడిని ట్రోల్ చేయడం మొదలెట్టారు. అటు సినిమా కెరీర్ బాగోలేక ఒకపక్క బాధపడుతుంటే.. మరోపక్క ఇలా ఇన్స్టాగ్రామ్ లోనూ ఆమెను ట్రోల్ చేస్తుండడాన్ని పాప తట్టుకోలేకపోతోంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus