Rashmika: రష్మిక మళ్ళీ టార్గెట్ అయ్యిందిగా… మేటర్ ఏంటి?

Ad not loaded.

నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) గురించి ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె ప‌ట్టింద‌ల్లా బంగారం కావడంతో లక్ ఆఫ్ సినిమాగా మారింది. ఇంకేముంది… నిర్మాతలు ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం ఆమె వరుసగా ఓ ఐదేళ్లు బిజీగా ఉన్నానని చెప్పినప్పటికీ ఎదురు చూసే నిర్మాతలు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఉత్త‌ర‌, ద‌క్షిణాది ఇండ‌స్ట్రీల‌లో ఆమె వ‌రుస హిట్స్ సాధిస్తుండటంతో ప్రస్తుతం ఆమె క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారింది. గతేడాది చివర్లో ‘పుష్ప‌-2’ తో (Pushpa 2: The Rule) బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న ఈ క‌న్న‌డ బ్యూటీ..

Rashmika

ఇప్పుడు హిందీలో ‘ఛావా’తో (Chhaava) మ‌రో సూప‌ర్ హిట్ ను త‌న ఖాతాలో వేసుకుంది.అయితే, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇపుడు సర్వత్రా పెను దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్యంగా ఈమె కన్నడ ప్రేక్షకులకి మరోసారి టార్గెట్ అయ్యింది.’ఛావా’ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ… “నేను హైద‌రాబాద్ నుంచి వ‌చ్చాను. ఇక్క‌డి ప్రేక్ష‌కులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది” అని చెప్పింది.

ర‌ష్మిక కన్నడ పరిశ్రమకి చెందిన అమ్మాయి. కానీ ఇలా అన‌డం ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. ఆమె వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌డుతూ రష్మికపై కన్నడిగులు మండిపడుతున్నారు.ఆమె సొంతూరు కర్ణాటకలోని ‘విరాజ్‌పేట‌’ గురించి చెప్పడానికి సంకోచించడాన్ని క‌న్న‌డ వాసులు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ‘కర్ణాటకకు చెందిన నువ్వు(రష్మిక)…

ఎప్పుడు హైదరాబాదీ అయ్యావో చెప్పాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు!ఇప్ప‌టికే కన్నడలో ఆమె సినిమాలు పెద్దగా చేయకపోవడం పట్ల కన్నడిగులు చాలా కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఆమె ఇలా చెప్పడం వారికి మరింత మండిపడేలా చేసింది. ఇక క‌ర్ణాట‌క కొడ‌గు జిల్లా విరాజ్‌పేట‌‌కు చెందిన ర‌ష్మిక‌.. హీరోయిన్ గా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty) ‘కిరిక్ పార్టీ’ (Kirik Party) తో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘ఛ‌లో’ (Chalo) తో డెబ్యూ ఇచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus