Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

తెలుగు సినీ పరిశ్రమలో ‘మహానటి’ (Mahanati) సావిత్రి తర్వాత ఆ రేంజ్లో పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య (Soundarya). ఆమె మరణించి 21 ఏళ్ళు కావస్తున్నా.. అంత ఈజీగా ఆమెను ఎవరూ మర్చిపోలేరు. చూడడానికి ఎంతో పద్ధతిగా.. చీరకట్టులో ఎక్కువగా కనిపిస్తూ వచ్చిన ఆమె గ్లామర్ పై ఆధార పడకుండా.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే ఎక్కువగా చేసింది. చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna) వంటి స్టార్ హీరోలందరితో ఎక్కువ సినిమాల్లో నటించింది.

Rashmika

కన్నడ, తమిళ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో కూడా అగ్ర హీరోలందరి సరసన నటించింది. సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె స్థానాన్ని మరో హీరోయిన్ భర్తీ చేయలేకపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అనే చెప్పాలి. అయితే ఇప్పుడున్న హీరోయిన్లలో రష్మిక మరో సౌందర్య అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సౌందర్యలానే రష్మిక కూడా కన్నడ హీరోయిన్. ఈమె చూడటానికి చాలా వరకు సౌందర్యలా ఉంటుంది అని కొందరు భావిస్తుంటారు. ‘పుష్ప’ (Pushpa) మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు అంటే 2021 ఆ టైంలో రష్మికని ఈ విషయమై ప్రశ్నించగా ఆమె చాలా మురిసిపోయింది.

అదే టైంలో ‘సౌందర్య బయోపిక్ తీయాలని ఏ దర్శకుడైనా అనుకుంటే.. అందులో నటించడానికి నేను సిద్ధం’ అని కూడా ఆమె మాటిచ్చింది. తర్వాత ఈ విషయాన్ని అంతా మర్చిపోయారు. అయితే నిన్న.. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) కొత్త సినిమా పూజా కార్యక్రమానికి రష్మిక (Rashmika Mandanna) గెస్ట్ గా వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో రష్మికని చూసినవారంతా మరోసారి ఆమెను సౌందర్యతో పోలుస్తున్నారు.

నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus