మాస్ మహారాజ్ సరసన మరోసారి ఇలియానా..!

టాలీవుడ్ లో సెంటిమెంట్లకు చాలా ఎక్కవ ప్రాముఖ్యత ఉంటుంది. ఓ డైరెక్టర్ తో లేదా, ఓ హీరోయిన్ తో చేసిన సినిమా హిట్ అవ్వకపోతే.. మళ్ళీ ఆ దర్శకుడు,హీరోయిన్ ల జోలికి పోరు కొంతమంది హీరోలు. అయితే మన రవితేజ ఇందుకు పూర్తి భిన్నంగా నడుచుకుంటుండడం గమనార్హం. మ్యాటర్ ఏంటంటే.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాతో రవితేజ చాలా సినిమాలు చేసాడు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే 4 సినిమాలు వచ్చాయి.

‘ఖతర్నాక్’ ‘కిక్’ ‘దేవుడు చేసిన మనుషులు’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ వంటి చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. అయితే ఒక్క ‘కిక్’ చిత్రం తప్ప మరే చిత్రమూ హిట్ అవ్వలేదు. వీరిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కాదని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు రవితేజ.. ఇలియానాకు మరోసారి ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. వివరాల్లోకి వెళితే.. రవితేజ .. మారుతి డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ తో చెయ్యబోతున్న ‘కిలాడి’ చిత్రం తరువాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.’యూవీ క్రియేషన్స్’ మరియు ‘జిఏ2’ పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని వినికిడి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా ను ఎంపిక చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకు రవితేజ కూడా ఓకే చెప్పేశాడట. వీరి కాంబినేషన్లో 3 ప్లాప్ లు వచ్చినప్పటికీ రవితేజ వెనకడుగు వెయ్యడం లేదట. ‘ఏమో ‘కిక్’ లాంటి హిట్ పడొచ్చేమో’ అని రవితేజ దర్శకనిర్మాతలకు సర్దిచెబుతున్నాడట.వాళ్ళు కనుక కన్విన్స్ అయితే ఇలియానాకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టే అని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus