దివి(Divya Vadthya) బిగ్ బాస్ సీజన్ 4 తో పాపులర్ అయ్యింది. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ‘బిగ్ బాస్’ తో పొందింది. అదే షోలో చిరంజీవి కంట పడింది. అది ఈమెకు చాలా వరకు కలిసొచ్చింది అనే చెప్పాలి. చిరంజీవి స్పెషల్ గా ‘గాడ్ ఫాదర్’ సినిమాలో రోల్ ఇప్పించే రేంజ్లో అతన్ని ఇంప్రెస్ చేసింది దివి. అదే టైంలో చిరు టీంకి కూడా ఈమె బాగా దగ్గరైనట్టు సమాచారం.
దాని వల్ల ఈమె ‘లంబసింగి’ అనే సినిమాలో మెయిన్ లీడ్ గా చేసే ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాల వల్ల అల్లు అర్జున్ ‘పుష్ప 2’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ చేసే ఛాన్సులు లభించాయి. అయితే తర్వాత చిరు తన టీంని మార్చేసుకున్నారు.అందువల్ల ఈమెకు ఉన్న ఓ మంచి ఆప్షన్ మిస్ అయినట్టు తెలుస్తుంది.
స్వతహాగా ఆఫర్లు తెచ్చుకోవడం దివికి చాలా కష్టం. ఎందుకంటే ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్.. బయట లేదు. గ్లామర్ పిక్స్ రూపంలో ఈమె టాలెంట్ చూపిస్తున్నా.. ఈమెకు పెద్ద ఛాన్సులు రావడం లేదు. అయితే ఓ మూలాన నిలబడే పాత్రలు లేదు అంటే.. ఒకటి, రెండు డైలాగులు చెప్పి మాయమయ్యే పాత్రలు. ఇలాంటివి చేయడం వల్ల ఆమెకు కలిసొచ్చేదేమీ ఉండదు.
అనసూయలా నెక్స్ట్ లెవెల్ రోల్స్ చేస్తేనే ఈమెకు మార్కెట్ ఏర్పడుతుంది. అప్పుడు ఆమెలా కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘పుష్ప 2’ ‘డాకు మహారాజ్’ సినిమాలకు మించిన పాత్రలు కొట్టాలన్న మాట.