రణబీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్ కొత్తిల్లు కట్టుకున్న సంగతి తెలిసిందే. కపూర్ ఫ్యామిలీకి చెందిన పాత ఇంటి ప్లేస్ లో ఈ కొత్తింటిని నిర్మించుకున్నారు. ముంబైలో ఇదివరకు కృష్ణ రాజ్ బంగ్లా ఉండేది. దాని ప్లేస్లోనే కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఈ మధ్యనే గృహప్రవేశం కూడా చేశారు. దీని ఖరీదు అక్షరాలా రూ.350 కోట్లని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ముంబైలో ఉన్న స్టార్స్ సెలబ్రిటీల ఇళ్లతో పోలిస్తే ఇది చాలా ఖరీదైన ఇల్లు కావడంతో ప్రత్యేకంగా నిలిచింది.
ఈ 6 అంతస్తుల భవనంకి అంత రేటు ఎందుకయ్యింది. దీని స్పెషాలిటీ ఏంటి? అని బీటౌన్ తో పాటు టీటౌన్ కూడా చర్చించుకుంటుంది.లేటెస్ట్ టెక్నాలిజీ, సెక్యూరిటీ ఫీచర్లతో ఈ ఇంటిని నిర్మించారు. 6 అంతస్తుల భవంతి అయిన్పటికీ గ్రౌండ్ ఫ్లోర్, మూడో ఫ్లోర్ లను విల్లాలుగా మార్చారు. భూకంపం వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఈ ఇంటికి ఉంటుందట. రణబీర్-అలియా..లకి 6 కార్లు ఉన్నాయి.
మరో 8 కార్లకి సరిపడా పార్కింగ్ ప్లేస్ సెట్ చేశారట. ఒక ఫ్లోర్ మొత్తం రణబీర్ తల్లి కోసం పూజ గదులతో స్పెషల్ గా నిర్మించారట. రణబీర్, అలియా.. వాళ్ళ పాప కోసం ఇంకో ఫ్లోర్ ఉంటుంది.బంధువుల వస్తే.. వాళ్ళు ఉండటానికి మరో ఫ్లోర్ ని డిజైన్ చేయించారట. ఈ భవనం అద్దాల కోసం వాడిన గ్లాస్ ను స్పెషల్ గా ఇటలీ నుండి తెప్పించారట. ఫర్నిచర్, ఇంటీరియర్ కి కావాల్సినవన్నీ కూడా ఇటలీ అలాగే నెదర్ల్యాండ్ నుండి తెప్పించినట్టు తెలుస్తుంది.