మరో ప్లాప్ డైరెక్టర్ కు ఓకే చెప్పిన రవితేజ..!

మాస్ మహారాజ్ రవితేజ వరుసగా నాలుగు డిజాస్టర్ లు మూటకట్టుకున్నాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని ‘డిస్కో రాజా’ చిత్రం చేసినా ఉపయోగం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో తన వద్దకు వచ్చిన దర్శకులకే ఓకే చెబుతున్నాడు. అంతేకాదు వీలైనంత త్వరగా సినిమాను ఫినిష్ చెయ్యాలని.. మేకింగ్ విషయంలో ఎక్కువ బడ్జెట్ అవ్వకూడదని షరతులు పెడుతున్నాడట.అయితే వరుసగా ప్లాప్ చిత్రాల దర్శకులకే రవితేజ ఓకే చెబుతుండడం.. ఆయన అభిమానులని ఒకింత కలవర పెట్టే అంశం. ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే చిత్రం చేస్తున్నాడు.

ఈ సమ్మర్ కి ఈ చిత్రం విడుదల కాబోతుంది. గోపీచంద్ మలినేని గత చిత్రం ‘విన్నర్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ రవితేజతో మాత్రం సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఉంది. ఇక ‘వీర’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో ఇప్పుడు రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మ గత చిత్రం ‘రాక్షసుడు’ హిట్టయినప్పటికీ.. అది పూర్తిగా రీమేక్ చిత్రం.. మక్కీ మక్కీ దింపేసాడు.. రమేష్ వర్మ. తరువాత త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేయబోతున్నాడు. ఆయన రామ్ తో తెరకెక్కించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సో సో గానే ఆడింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ వంటి డిజాస్టర్ అందించిన వక్కంతం వంశీతో ఓ చిత్రం చేయబోతున్నాడట. వంశీ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రావడం.. ఓ గంట సిట్టింగ్ లో రవితేజ ఓకే చేసెయ్యడం వంటివి జరిగిపోయాయట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అనౌన్స్ మెంట్ ఉంటుందని సమాచారం. రవితేజ ‘కిక్’ సినిమాకి వక్కంతం వంశీ కథని అందించాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పటికి కుదిరినట్టుంది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus