రాజమండ్రి రోడ్డు మీద సమంత యూ టర్న్!

గత రెండు నెలలుగా “రంగస్థలం” షూటింగ్ కోసం పాపికొండలు పరిసర ప్రాంతాల్లో మరియు రాజమండ్రిలో గడిపిన సమంత మళ్ళీ రాజమండ్రికి వెళ్లిపోయింది. అయితే.. ఏదో హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి కాదండోయ్. తన తాజా చిత్రం “యూ టర్న్” షూటింగ్ కోసం వెళ్లింది. రాజమండ్రి జనాలందరూ సమంతకి బ్రహ్మరధం పట్టారు. కన్నడలో ఘన విజయం సొంతం చేసుకొన్న “యూ టర్న్” చిత్రానికి రీమేక్ గా తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కన్నడ వెర్షన్ ను డైరెక్టర్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

రాజమండ్రి బ్రిడ్జ్ నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించి, తర్వాత హైద్రాబాద్ లో మిగతా షూటింగ్ పూర్తి చేస్తారట. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది సమంత. అలాగే ఈ ఏడాది అత్యధిక చిత్రాలు విడుదలవుతున్న హీరోయిన్ కూడా సమంతే కావడం విశేషం. ఈ ఏడాది సమంత కథానాయికగా నటిస్తున్న సినిమాలు ఏకంగా ఆరు విడుదలకానున్నాయి. పెళ్లైన తర్వాత ఏ సినిమా హీరోయిన్ అయినా స్పీడ్ తగ్గిస్తుంది. కానీ.. సమంత మాత్రం విభిన్నంగా పెళ్లి తర్వాత సినిమాల సంఖ్యతోపాటు స్పీడ్ కూడా పెంచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus