Shruti Haasan: అందుకే అతనితో ఎక్కువ సమయం గడుపుతా.. హీరోయిన్ కామెంట్స్!

  • August 31, 2021 / 12:09 PM IST

నటి శృతిహాసన్ కొన్నాళ్లక్రితం వరకు లండన్ కు చెందిన మైకేల్ అనే వ్యక్తితో డేటింగ్ చేసేది. వీరిద్దరికి బ్రేకప్ జరగడంతో కొన్నాళ్లు సైలెంట్ అయిపోయింది శృతి. ఇప్పుడు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి పార్టీలకు, డిన్నర్ డేట్ లకు వెళ్తూ చాలా సార్లు కెమెరా కంటపడ్డారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా శృతి ప్రస్తుతం శాంతనుతో కలిసి జీవిస్తుండడం..

సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుండడంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు శాంతనుతో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన శృతి.. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించింది. శాంతను తన బెస్ట్ ఫ్రెండ్ అని.. కళలు, సంగీతం పట్ల అతనికి అవగాహన ఉందని.. మా ఇద్దరి అభిరుచులు ఒకటేనని.. అందుకే అతడితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతా అని చెప్పుకొచ్చింది.

శాంతనుపై తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో ఎలాంటి సీక్రెట్స్ లేవని చెప్పింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆ వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తానని.. కానీ ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే.. శృతి నటించిన ‘క్రాక్’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ తో కలిసి ‘సలార్’ సినిమాలో నటిస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus