మరోసారి సూర్య తండ్రి దురుసు ప్రవర్తన!

  • February 29, 2024 / 10:55 AM IST

సినిమా వాళ్ళని చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యంతో, ఆనందంతో పరిగెత్తుకుని వస్తుంటారు. వారితో ఏదో ఒకటి మాట్లాడాలి, కుదిరితే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అదొక ఆనందం. ఇంకో రకంగా ‘ అన్ కండిషనల్ హ్యాపినెస్’ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వారు అభిమానులు కొంచెం బ్యాలెన్స్ తప్పి తమ అభిమాన నటీనటులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి సహజం. ఇప్పటి తరం నటీనటులు వీటిని సీరియస్ గా తీసుకోవడం లేదు.

ఇంకొంతమంది మొహమాట పడుతున్నారు. కానీ సీనియర్ నటీనటులు (Suriya) మాత్రం.. వాళ్ళని కంట్రోల్ పెట్టే క్రమంలో సహనం కోల్పోతున్నారు. బాలయ్య విషయంలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. గతంలో సూర్య తండ్రి శివకుమార్ కూడా అభిమాని సెల్ఫీ తీసుకుంటూనే.. పక్కకి నెట్టేశాడు. ఇప్పుడు మరోసారి అభిమానితో దురుసుగా ప్రవర్తించాడు. ఓ అభిమాని శివ కుమార్ ని శాలువాతో సత్కరించాలి అనుకున్నాడు. కానీ శివ కుమార్ దానిని విసిరేసాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

చాలా మంది నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. దీంతో శివ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ‘అతని పేరు కరీమ్..నాకు తమ్ముడితో సమానం అని, నా కోసం శాలువా తెచ్చాడు. నాకెందుకురా ఇది అని ఇచ్చేసి క్రమంలో అది కింద పడింది. మళ్ళీ నీ దగ్గరే ఉంచు అని అతని చేతుల్లో పెట్టాను’ అంటూ శివ కుమార్ వివరణ ఇచ్చాడు. ఇక కరీమ్ మనవడు కూడా ఇది నిజమే అని క్లారిటీ ఇచ్చాడు.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus