ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి ఇష్టం లేని కాంబినేషన్ అవసరమా?

నందమూరి నటసింహం బాలయ్యకు ఓ సాలిడ్ హిట్ కావాలి. ఒకప్పుడు భారీ హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టిన బాలకృష్ణ ఆ స్థాయి హిట్ అందుకోని చాలా ఏళ్ళు అవుతుంది. గత ఏడాది వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్స్ ఆయన దాహం తీర్చుతాయని అందరూ భావించారు. ఆయన వీరాభిమానులైతే రికార్డ్స్ గల్లతేం అని అంచనాలు వేశారు. రికార్డ్స్ అయితే వచ్చాయి కానీ అవి బెస్ట్ రికార్డ్స్ కాదు. వారి అంచనాలకు వ్యతిరేకంగా ఆ రెండు చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్ లోనే డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఆ తరువాత వచ్చిన జై సింహ చిత్రం కూడా అదే దాటిపట్టింది.

లెజెండ్ సినిమా తరువాత బాలయ్యకు గౌతమీ పుత్ర శాతకర్ణి కొంత ఊరటనిచ్చింది. వరుస పరాజయాలు బాలయ్య మార్కెట్ ను తీవ్రంగా దెబ్బ తీశాయి. రూలర్ వసూళ్లు ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే, ఖైదీ, విజిల్ సినిమాలకంటే తక్కువ. బాలయ్య సినిమా ఓ యంగ్ హీరో మరియు డబ్బింగ్ సినిమాలతో కూడా పోటీపడలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బోయాపాటి ని నమ్ముకున్న బాలయ్య ఆయనతో సినిమా చేస్తున్నాడు. ఐతే ఈ చిత్రం తరువాత ఆయన పూరితో చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇదే నిజం అయితే ప్రేక్షకులకు ప్రాణ సంకేటమే. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ పైసా వసూల్ ఫలితం అందరికీ తెలిసిందే.

ఆ సినిమాకు థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు ఏసీ లో కూడా ముచ్చమటలు పట్టించారు పూరి మరియు బాలయ్య. పూరి టేకింగ్ మరియు మేనరిజం బాలయ్యకు అస్సలు సెట్ కాలేదు. ఆ సినిమా ఫలితం కూడా ఫ్లాప్ గా మిగిలింది. అలాంటిది ఈ కాంబినేషన్ బాలయ్యకు మళ్ళీ అవసరమా అని అందరూ చెవులు కొర్రుక్కుంటున్నారు. పూరి లాక్ డౌన్ లో స్క్రిప్స్ట్ రాస్తుండగా అది బాలయ్య కోసమే అని తెలుస్తున్న సమాచారం. బాలయ్య కూడా గతంలో పూరితో సినిమా చేయడానికి ఆల్వేస్ రెడీ అని చెప్పారు. కాబట్టి ఈ వార్తలను కొట్టి పారేయలేం. ఏది ఏమైనా పూరి-బాలయ్య కాంబినేషన్ ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోరుకోవడం లేదు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus