Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: నాయకుడు కాడొదిలేశాడు… కొత్తాయన అంతంతమాత్రమే!

Tollywood: నాయకుడు కాడొదిలేశాడు… కొత్తాయన అంతంతమాత్రమే!

  • January 4, 2022 / 08:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: నాయకుడు కాడొదిలేశాడు… కొత్తాయన అంతంతమాత్రమే!

ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు… చాలా సినిమాల్లో ఈ డైలాగ్‌ వినే ఉంటారు. ఆ తర్వాత మీ జీవితంలో కూడా ఎక్కడోయ దగ్గర ఆ మాట వాడే ఉంటారు. అయితే ఆ డైలాగ్‌ను సినిమా పరిశ్రమ మీదే వాడాల్సి వస్తే… చాలా బాధగా ఉంటుంది కదా. కానీ అదే పరిస్థితి ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వచ్చింది. అవును మీరు విన్నది కరెక్టే, అనుకుంటున్నదీ కరెక్టే. సినిమా పరిశ్రమకు పెద్దన్న లేకపోవడం గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. చిత్ర పరిశ్రమలో పెద్దన్న పాత్ర అంటే ఠక్కున గుర్తొచ్చేది ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు. ఆయన తర్వాత ఆ స్థానం ఇప్పటికీ ఖాళీనే.

మధ్యలో చిరంజీవి ఆ స్థానంలోకి వస్తారని చాలామంది అనుకున్నారు. ఆయన మనసులో కూడా అదే ఆలోచన ఉందని వార్తలొచ్చాయి. కరోనా సమయంలో ఇండస్ట్రీ గురించి ఆయన తీసుకున్న శ్రద్ధ, చేసిన సేవా కార్యక్రమాలు, కొన్ని అంశాల గురించి ప్రస్తావించిన తీరు… చూసి జనాలు ఇక ఇండస్ట్రీకి చిరంజీవే పెద్దన్న అవుతారు అని అనుకున్నారు. అందుకు తగ్గట్టే చిరంజీవి అడుగులు కూడా కనిపించాయి. కానీ ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. ‘నేను పెద్దన్న పాత్ర పోషించను’ అంటూ చిరంజీవి తేల్చేశారు. దీంతో సమస్య తిరిగి మొదటికొచ్చింది.

పోనీలే చిరంజీవి కాకపోతే మోహన్‌బాబు అయినా ముందుకొస్తారులే అన్న చిన్న ధైర్యం ఒకటి కొందరిలో కనిపించింది, వినిపించింది. కొడుకు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఉండటం, పరిశ్రమ మీద పట్టు కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుండటం వంటి కారణాలతో మోహన్‌బాబు ‘పెదరాయుడు’ అవుతారు అని అనుకున్నారు. అనుకున్నట్లుగానే చిరంజీవి ‘కాడి’ వదిలేసిన ప్రకటన తర్వాత సాయంత్రానికి మోహన్‌బాబు నుండి పరిశ్రమ కష్టాల గురించి లేఖ వచ్చింది. దీంతో ‘నాయకుడు’ దొరికాడు అని అందరూ అనుకున్నారు.

అయితే లేఖ మొత్తం చదివాక పరిస్థితి మారిపోయింది. నాయకుడు వచ్చాడు… అయితే మీరు జాగ్రత్తగా ఉండండి, సీఎంలను గౌరవించండి, కష్టాలు చెప్పుకోండి, నేను కూడా లేఖ రాస్తాను అని ఓ లేఖ రాశాడు ఆ కొత్త నాయకుడు మోహన్‌బాబు. అంతేకాదు నిర్మాతల మండలి ఈ విషయంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదు అంటూ వాళ్ల మీద ఓ రాయి విసిరారు. అందరం కలసి పరిశ్రమను కాపాడుకుందాం అంటూ మరో ప్రకటన కూడా ఆ లేఖలో చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మోహన్‌బాబుకు మంచి అనుబంధమే ఉంది.

రాజకీయ అనుబంధాలు, బంధాలతో మోహన్‌బాబు ముందుకొచ్చి సీఎంలతో భేటీ ఏర్పాటు చేసి ఏపీలో టికెట్ల సమస్యను చిటికెలో మాయం చేసేయొచ్చు. కానీ ఆయన ఆ దిశగా ఆలోచించలేదు. పరిశ్రమ అంటే నలుగురు కాదు… అందరూ అంటూ స్టీరియో టైప్‌ డైలాగ్‌లు వేశారు. దీంతో నాయకుడు వచ్చాడు కానీ ఏమీ చేయలేదు అనే పరిస్థితి వచ్చింది. పోనీ ఈ లేఖ శాంపిల్‌ మాత్రమే. తర్వాత ఏమైనా స్టెప్‌ వేస్తారా? తెలుగు సినిమా పరిశ్రమ సమస్యను తీర్చి ఇండస్ట్రీకి ‘పెద రాయుడు’ అవుతారా? అనేది చూడాలి. ఒకవేళ ఇదే జరిగితే అంతా ఆనందమే. లేదంటే టాలీవుడ్‌ కష్టం పగోడికి కూడా రాకూడదు అని మరోసారి అనాల్సి ఉంటుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mohan Babu
  • #Movies
  • #Tollywood

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

3 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

6 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

7 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version