Thaman: ‘గేమ్ ఛేంజర్’ ట్రోలింగ్ నుండి తమన్ ఇంకా బయటపడలేకపోతున్నాడుగా..!

తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మ్యూజిక్ గురించి, తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ గురించి ట్రోల్స్ జరిగాయి. అవి అందరికీ తెలిసినవే. దీనికి కారణం కూడా తమన్ (S.S.Thaman) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘గేమ్ ఛేంజర్’ పాటలు ఆడియన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం గురించి తమన్ ఓపెన్ అయ్యాడు. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా పాటలన్నీ 2021 లోనే కంపోజ్ చేశానని.. కానీ సినిమా ఆలస్యంగా రిలీజ్ అవ్వడం వల్ల.. అవి ఆడియన్స్ కి పాత పాటల్లా అనిపించాయని’ తమన్ తెలిపాడు.

Thaman

అక్కడి వరకు తమన్ ని తప్పుబట్టనవసరం లేదు. అతను బాగానే రియలైజ్ అయ్యాడు. అందులో లాజిక్ కూడా ఉంది. కానీ ఆ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ సినిమా పాటలు ఆడియన్స్ కి ఎందుకు ఎక్కలేదు అంటే.. కొరియోగ్రఫీ లోపం కూడా ఉందన్నట్టు తమన్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమా పాటల్లో ఒక్క దానికి కూడా సరైన హుక్ స్టెప్ లేదని.. అందుకే అవి ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ కాలేదని.. ‘జరగండి’ పాటకి సరైన కొరియోగ్రఫీ లేదన్నట్టు తమన్ మాట్లాడాడు.

ఓ రియాలిటీ షోలో తమన్ తన అసహనాన్ని కూడా పరోక్షంగా బయటపెట్టాడు. మరోపక్క తమన్ ఇచ్చిన ట్యూన్ ఏమైనా గొప్పగా ఉందా? దానికి ‘హుక్ స్టెప్స్, బ్రేక్ డాన్స్ వేయడానికి’ అంటూ కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ‘జరగండి’ పాటలో సెట్లు ఎక్కువైనా కొరియోగ్రఫీ అనేది కరెక్ట్ గా లేదు అని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. సో తమన్ ఉద్దేశం ఒక రకంగా కరెక్ట్. కానీ ట్యూన్ నిజంగానే ఆకట్టుకునేలా ఏమీ లేదు.

‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) పాటల్లో హుక్ స్టెప్స్ ఉండటం వల్ల అవి ఆడియన్స్ కి ఎక్కాయి అన్నాడు. అది అదనపు ఆకర్షణ అయ్యింది. కానీ ‘అల వైకుంఠపురములో’ పాటలు ఇప్పుడు విన్నా ఫ్రెష్ గా ఉంటాయి. వాటికి తమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. కానీ అతను దాన్ని గ్రహించకుండా ‘గేమ్ ఛేంజర్’ ట్యూన్స్ పాతవి అయిపోయాయి అన్నట్టు చెప్పడం..కరెక్ట్ కాదు. ఏదేమైనా తమన్ మళ్ళీ నెటిజన్లకు దొరికేశాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus