సినిమాలో పాత్రకు, నిజ జీవితంలో మనిషికి తేడా గమనించకుండా.. నోటికి ఏదొస్తే అది అనేసి బాధపెడుతుంటారు కొంతమంది నెటిజన్లు. అలా రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా బాధపడిన కథానాయిక వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) . ‘బేబీ’ (Baby) సినిమాలో ఆమె పాత్ర బాగా పండింది అనడానికి ఈ రెస్పాన్సే ఉదాహరణ. అయితే ఆమె పడ్డ మాటలు కొన్నిసార్లు చాలా బాధపెట్టాయి. ఆమెనే కాదు, సగటు సినిమా అభిమానిని కూడా బాధపెట్టాయి. అయితే మరోసారి అలాంటి రెస్పాన్స్ ఆశిస్తున్నారు ఓ నిర్మాత.
అవును, మరోసారి వైష్ణవి చైతన్యనను బ్యాడ్‌గా చూపిస్తూ సినిమా విజయం మీద కన్నేశారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీనే (Suryadevara Naga Vamsi ) చెప్పారు. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ (Jack) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్మాత నాగవంశీ అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుతూ మా నెక్ట్స్ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). ఇప్పటివరకు ఓ రకంగా చూశారు ఆమెని. మేం ఆమెను మాస్‌గా చూపించబోతున్నామని చెప్పారు.
అక్కడితో ఆగకుండా వైష్ణవిని చివరిసారి పద్ధతిగా చూసేయండి. మా సినిమాలో మామూలుగా ఉండదు. అన్నీ బూతులే మాట్లాడుతుంది. అయితే అవి మోడ్రన్ బూతులు. నా సినిమాలో ఈ అమ్మాయిని చాలా బ్యాడ్ గా చూపిస్తాం అని క్లారిటీ ఇచ్చేశారు నాగవంశీ. అయితే ఆ సినిమా ఏంటి అనే విషయం ఆయన చెప్పలేదు. ఇదంతా వింటుంటే హీరోయిన్‌కి నాగవంశీ ఇచ్చిన ఎలివేషన్ అని అర్థమవుతుంది. పనిలో పనిగా ఆ సినిమా కోసం కుర్రాళ్లకు టీజర్ కూడా ఇచ్చారు.
సితార బ్యానర్‌లో ప్రస్తుతం చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో దేంట్లో వైష్ణవి చైతన్యను తీసుకున్నారు అనేది తెలియాలి. ఏ సినిమా అయినా అది కచ్చితంగా తెలంగాణ బేస్డ్ కథే అయి ఉంటుంది. ఎందుకంటే ఆమెకు అలాంటి పాత్ర అయితే బాగా నప్పుతుంది అని ఆమె మాట తీరు చూస్తే అర్థమవుతుంది. స్లాంగ్ పక్కాగా కుదురుతుంది కాబట్టి.