తెలుగు తెరకు వచ్చినప్పటి నుంచే అందం, అభినయం, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ‘పుష్ప’తో (Pushpa) ప్రారంభమైన ఆమె పాన్ ఇండియా ప్రయాణం, ‘యానిమల్’తో (Animal) మరో అడుగు ముందుకు వెళ్లింది. ఈ రెండూ భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా రష్మికకు బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) విడుదల తర్వాత అందరూ ఊహించినదానికంటే ఎక్కువ విజయాన్ని సాధించింది. ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఆ రికార్డును దాటిన తెలుగు సినిమాలు అరుదు. అంచనాలను దాటి బాక్సాఫీస్‌ను శాసించిన ఈ విజయం రష్మిక క్రేజ్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో ఆమెకున్న ఫాలోయింగ్ మరో స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే రష్మిక మళ్ళీ రణబీర్ కపూర్‌తో (Ranbir Kapoor) కలిసి నటించబోతున్న ‘యానిమల్ పార్క్’ చిత్రం భారీ అంచనాల నడుమ మొదలుకాబోతోంది. ఈ సినిమాకి ‘యానిమల్’ సీక్వెల్‌గా రూపొందుతుండటం విశేషం.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సారి కథను మరింత మసాలాతో, హై యాక్షన్ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దబోతున్నట్లు టాక్. రష్మిక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ సినిమాతో పాటు రష్మిక రెమ్యునరేషన్ గేమ్ కూడా కొత్త మలుపు తిరిగింది. ‘పుష్ప 2’ విజయంతో ఆమెకు స్టార్ హీరోల చిత్రాల్లో ప్రత్యేక స్థానం దక్కింది. ఇప్పటికే 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక, ‘యానిమల్ పార్క్’తో ఆ లెక్కను 10 కోట్లకు చేరుస్తుందని టాక్.
ఒకవేళ ఈ సినిమా ఊహించిన స్థాయిలో 2000 కోట్ల మార్క్‌ను చేరితే రష్మిక కెరీర్ మరో మైలురాయిని అందుకుంటుంది. ఇక రష్మిక ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సరసన దూసుకుపోతోంది. ఈ విజయాల నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్ రేసులో టాప్‌లో నిలిచే అవకాశం ఉంది.