యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. దీనికోసం డార్లింగ్ రోజుకు 16 గంటలు కష్టపడ్డారు. ఒక నెల, రెండు నెలలు కాదు, ఏకంగా మూడు సంవత్సరాల పాటు పక్కా డైట్ ఫాలో అయ్యారు. క్రమ పద్ధతిలో ఆహారం తీసుకుంటూ, నిపుణుల ఆధ్వర్యంలో వ్యాయామం చేశారు. అతను పడిన కష్టం బాహుబలి బిగినింగ్ చిత్రంలో సగం కనిపిస్తే.. మరో సగం బాహుబలి కంక్లూజన్ లో రివీల్ కానుంది. ఇప్పటికే బాహుబలి 2 ఫస్ట్ లుక్ లో ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీ తో అదరగొట్టారు. సినిమాపై అంచనాలను పెంచారు.
ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ వేడుకలో విలేకరులు… “ఒక సినిమాకోసం మూడేళ్లు కష్టపడ్డారు.. ఈ సమయంలో మీకు అనేక ఆఫర్స్ వచ్చాయి కదా.. వాటిని మిస్ చేసుకున్నందుకు ఎప్పుడూ బాధపడలేదా?” అని ప్రభాస్ ని ప్రశ్నించగా .. అందుకు ఆయన స్పందిస్తూ.. తాను ఎప్పుడూ బాధపడలేదని చెప్పారు. ఎందుకంటే బాహుబలి ఒక సినిమా వంద చిత్రాలతో సమానమని వెల్లడించారు. వంద సినిమాలు చేసినా రాని పేరు ఈ ఒక్క చిత్రంతో తనకి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం డార్లింగ్ బాహుబలి కంక్లూజన్ చిత్రం పాటల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈనెలాఖరుకు ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకోనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.