మెగా ఫ్యామిలీలో మరో పార్టీ.. ఈసారి పిచ్చెక్కిపోవాల్సిందే..!

  • December 7, 2023 / 05:36 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి నవంబర్ 1వ తేదీన ఇటలీలో ఘనంగా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ని కూడా ఆహ్వానించారు అంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే ఆమె పెళ్లికి రాలేదని తెలిసిందే. అలాగే కూతురు ఆద్య కొడుకు అకీరా అటెండ్ కానీ విషయం తెలిసిందే..

ఇమె తో పాటు అకీరా కూడా రాలేదనే లోటు (Mega Family) మెగా ఫ్యాన్స్ కి కూడా ఉంది. అయితే మెగా ఫ్యాన్స్ లోటు తీర్చిసే న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటో తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా లావణ్య – వరుణ్ పెళ్లి జరిగినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ లు ఎక్కడ కనిపించిన సరే అవి జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతున్నాయి.

ప్రజెంట్ ఈ జంట హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. దాదాపు 7 దేశాలు చుట్టేసి హనీమూన్ ని ఫుల్ ఎంజాయ్ చేయాలని భావిస్తుందట ఈ జంట. అయితే ఇండియా తిరిగి వచ్చాక మాత్రం ఈ జంట ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వబోతుందట. కేవలం మెగా కుటుంబ సభ్యులు – అల్లు కుటుంబ సభ్యులు – కామినేని కుటుంబ సభ్యులు మాత్రమే ఎంజాయ్ చేసేలా ఓ పార్టీను హోస్ట్ చేయబోతుందట వరుణ్ లావణ్య జంట.

ఈ ఫంక్షన్ కి మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు అకిరా ఆధ్యా కూడా అటెండ్ కాబోతున్నారట . పలువురు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ పార్టీకి హాజరు కాబోతున్నారట . దీంతో మెగా ఫ్యాన్స్ ఈ న్యూస్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు చాలా రోజుల తరువాత ఆద్యాని అకిరాని పవన్ తో చూడబోతున్నాం అంటూ సంతోషపడిపోతున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus