Bheemla Nayak: భీమ్లా డైరెక్టర్ పవన్ ను అలా చూపిస్తున్నారా?

చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా రెండు నెలలు పోస్ట్ పోన్ కావడంతో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చే అవకాశం ఉందని ప్రచారం జరగగా భీమ్లా నాయక్ మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆ ప్రచారానికి చెక్ పెట్టారు. భీమ్లా నాయక్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో ఈ సినిమా ఫిబ్రవరి నెలలోనే కచ్చితంగా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ ను రిలీజ్ చేస్తే ఈ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.

దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లోని ఊరమాస్ యాంగిల్ ను చూపిస్తారని సమాచారం. ఈ సినిమాలోని ఫైట్ సీన్లు ప్రేక్షకులకు పూనకాలు వచ్చే విధంగా ఉంటాయని బోగట్టా. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ సీన్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని బోగట్టా.

పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటిస్తుండగా రానాకు జోడీగా కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా రిలీజవుతున్న ఈ సినిమా 110 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పవన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కొరకు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే సినిమాలో భీమ్లా నాయక్ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus