Prabhas: ప్రభాస్ అభిమానులకు ట్రిపుల్ ధమాకా.. ఏమైందంటే?

  • December 5, 2022 / 10:34 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ బాహుబలి1, బాహుబలి2 సినిమాలకు ఏకంగా ఐదు సంవత్సరాల సమయం కేటాయించగా ఈ రెండు సినిమాలు ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను తెచ్చిపెట్టడంతో పాటు ప్రభాస్ సినిమాలు అంటే రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగించాయి. గతంలో నిదానంగా సినిమాలు చేసిన ప్రభాస్ ఇప్పుడు శరవేంగా సినిమాలలో నటిస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

అయితే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా మూడో షెడ్యూల్ షూట్ జరుగుతోందని తెలుస్తోంది. మారుతి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ ప్రభాస్ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఉండనుందని తెలుస్తోంది. వరుస ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీగా ఉండగా వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.

ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది కచ్చితంగా థియేటర్లలో విడుదలవుతాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి కాంబో మూవీ కూడా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం. ఏకంగా మూడు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ అవుతుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసి పాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోజురోజుకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుండటంతో పాటు అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus