4 Idiots: ఎవరా నాలుగో ‘ఇడియట్‌’.. ఆమిర్‌ – హిరానీ ప్లానేంటి?

ఆమిర్‌ ఖాన్‌ సినిమాల్లో ఎమోషనల్‌ బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న సినిమా ‘3 ఇడియట్స్‌’. ఈ సినిమాకు సీక్వెల్‌ ఆలోచన చేసినట్లుఇటీవల ఆమిర్‌ ఖాన్‌ చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో ఇడియట్‌ యాడ్‌ అవుతాడట. అవును ‘3 ఇడియట్స్‌’ కాస్త ‘4 ఇడియట్స్‌’ అవుతారు అని తెలుస్తోంది. ఈ మేరకు సినిమా పేరును ‘4 ఇడియట్స్‌’ అనే సినిమా పేరును ఫిక్స్‌ చేసుకున్నారట.

4 Idiots

‘3 ఇడియట్స్‌’ ప్రపంచాన్ని విస్తరించాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. ‘4 ఇడియట్స్‌’ పేరుతో సీక్వెల్‌ను తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మొదటి భాగంలోని నటీనటులు తిరిగి రానున్నారు. అయితే ఆ నాలుగో ఇడిట్‌ ఎవరు అనేది ఇంకా తేల్చలేదు అని టీమ్‌ చెబుతోంది. ఈ పాత్రలో నార్త్ యంగ్‌ హీరో ఒకడు నటిస్తాడు అని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అది తేలాక నాలుగో ‘ఇడియట్‌’ వస్తాడని టాక్‌.

ఆమిర్‌ ఖాన్‌, మాధవన్‌, షర్మాన్‌ జోషి ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘3 ఇడియట్స్‌’ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీసు దగ్గర భారీ విజయం సాధించింది. వసూళ్ల పరంగానే కాకుండా వినోదం పరంగా, విషయాలోచన పరంగా ఈ సినిమా అదరగొట్టింది. విద్యా వ్యవస్థ విషయంలో ఈ సినిమా తీసుకొచ్చిన చర్చ చాలా పెద్దది. నిజానికి ఆమిర్‌, రాజ్‌కుమార్‌ హిరానీ దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ చేయాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్‌ విషయంలో ఇబ్బందులు ఎదురై ఆ ప్రయత్నం విరమించుకున్నారు. దీంతో ‘3 ఇడియట్స్‌’ సీక్వెల్‌ ఆలోచన వచ్చిందట.

అయితే, ఈ సినిమాను సౌత్‌లో కూడా రిలీజ్‌ చేసి ఇక్కడ మార్కెట్‌ను క్యాష్‌ చేసుకోవాలి అనుకుంటే సౌత్‌ హీరోనే తీసుకుంటారని చెప్పొచ్చు. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం. లేదు. ఇక ఆమిర్ ఖాన్‌ ఈ ఏడాది ‘సితారే జమీన్‌ పర్‌’, ‘కూలీ’ సినిమాల్లో నటించాడు. ఇప్పుడు చేతిలో ‘హ్యపీ పటేల్ ఖత్నారక్‌ జాసూస్‌’ సినిమాల్లో నటిస్తున్నాడు.

తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus