RRR Movie: ఆర్ఆర్ఆర్ రెండో సాంగ్ రిలీజ్ అప్పుడేనా?

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. గత నెల నుంచి ఈ సినిమా మేకర్స్ వరుసగా సినిమాకు సంబంధించిన అప్ డేట్లను ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ నెలలో ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన దోస్తీ సాంగ్ ఛార్ట్ బస్టర్ గా నిలవడంతో పాటు అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి త్వరలో సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఎప్పుడు ఈ సాంగ్ రిలిజవుతుందనే క్లారిటీ లేకపోయినా త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ కు సంబంధించిన ప్రకటన రానుంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సాంగ్ రిలీజవుతుందేమో చూడాల్సి ఉంది. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చరణ్, తారక్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆగష్టు నెల 20వ తేదీ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

ఒలీవియా మోరిస్, అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా సముద్రఖని, రాజీవ్ కనకాల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 13వ తేదీన దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. రాజమౌళి ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus