ఆచార్య సినిమాలో షాకింగ్ ట్విస్ట్ ఉండబోతుందా..?

2021 సంవత్సరంలో విడుదల కాబోతున్న సినిమాలలో ఒకటైన ఆచార్య సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో చిరంజీవి కొన్ని నిమిషాల పాటు కనిపించినా చరణ్, చిరంజీవి పుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తే చూడాలనే మెగాభిమానుల కోరిక ఆచార్య సినిమాతో నెరవేరనుంది. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ధా అనే పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చనిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మెహబూబ్ కూడా నటిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా పాపులరిటీని సంపాదించుకున్న మెహబూబ్ కు చిరంజీవి కీలక పాత్రను ఆఫర్ చేశారని చరణ్ తో పాటు ఈ పాత్ర తెరపై కనిపిస్తుందని సమాచారం. ఇప్పటికే చరణ్, మెహబూబ్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ ను కొరటాల శివ పూర్తి చేశారు. పోలీసుల కాల్పుల్లో చరణ్, మెహబూబ్ పాత్రలు చనిపోతాయని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే మే 13వ తేదీ వరకు ఆగాల్సిందే. సినిమాలో చరణ్ పాత్రను చంపేస్తే మాత్రం కొరటాల శివ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చినట్లేనని చెప్పాలి.

ఆచార్య సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను దక్కించుకోగా మిగిలిన ఏరియాల హక్కులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే ఈ మూవీలో నటిస్తుండగా చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. చిరంజీవి, కాజల్ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus