Salaar Movie: సలార్ లీక్.. టీమ్ కు మరొక తలనొప్పి

సాధారణంగా ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా పెద్ద సినిమాలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక టీమ్ ను ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని సినిమాలు సీన్స్ కూడా ప్రత్యేకంగా ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుండడం విశేషం. ఇప్పుడు మరొక సారి సలార్ సినిమాకు సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయినట్లు తెలుస్తోంది.గతంలోనే చాలాసార్లు సలార్ కు సంబంధించిన సీన్స్ లీక్ అయ్యాయి. పాట ఒకటి అలాగే యాక్షన్ సీన్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

ఇక ఇప్పుడు మరొకసారి ప్రభాస్ కు సంబంధించిన లోకేషన్ సీన్ కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో చిత్ర నిర్మాతలు దర్శకుడు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో వెంటనే లీకేజి గల కారణాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. వీలైనంత వరకు మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. లీక్స్ విషయంలో పుష్ప టీమ్ కు ఇలాగే జరగడంతో ఎవరిని కూడా లోపలికి మొబైల్ ఫోన్లను తీసుకురావద్దని ఆంక్షలు విధించడం జరిగింది.

ఇక ఇప్పుడు సలార్ టీమ్ కూడా అలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ 2ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో సలార్ సినిమా మరికొన్ని నెలలు వాయిదా పడినట్లు క్లారిటీ వచ్చేసింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus