రామరాజు, సీత లుక్స్ వైరల్..!

మొన్నటికి మొన్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ లుక్స్ గురించి అలాగే కొన్ని కీలక సన్నివేశం గురించి లీక్ చేసి రాజమౌళి అండ్ టీం కు ఆగ్రహం తెప్పించాడు. ఈ విషయంలో ఆ వ్యక్తి పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తెలియక కాస్త మందలించి సరిపెట్టుకున్నాడట జక్కన్న. అంతేకాదు సినిమాలో నటించే చిన్న ఆర్టిస్ట్ లు కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విడుదల అయ్యే వరకూ ఎటువంటి ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదదని .. ఒకవేళ ఇచ్చినా … ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రస్తావన వస్తే… స్కిప్ చెయ్యాలి అని గట్టిగా చెప్పాడట. అయితే రాజమౌళి ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీక్ లు మాత్రం ఆగడం లేదు.

తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ రెండు ఫోటోలు లీక్ అయ్యాయి. ఒకటి అల్లూరి పాత్ర చేస్తున్న చరణ్ … మరియు సీతా మహాలక్ష్మి పాత్ర చేస్తోన్న అలియా భట్ కు సంబందించినది. ఈ ఫొటోల్లో చరణ్ బ్రిటిష్ వారి దుస్తుల్లో కనిపిస్తున్నాడు. నిజ జీవితంలో అల్లూరి … బ్రిటిష్ వారి దగ్గర పనిచేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. అయితే ఇది ఫిక్షనల్ మూవీ కాబట్టి … రామరాజు పాత్ర ఓ సందర్భంలో అలా ఉండబోతుందని స్పష్టమవుతుంది. అయితే ఇవి ఫ్యాన్ మేడ్ పోస్టర్లు మాత్రమే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది నిజమో … క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 2021 జనవరి 8న విడుదల కాబోతున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus