అందాల భామ నయన తార కధ మళ్లీ మొదటికి ఒచ్చింది…మళ్ళీ ఒంటరిగా ఉంటుంది…ఒకరి తరువాత మరొకరు అంటూ దాదాపుగా ముగ్గురిపై అసలు పెట్టుకుని ఏం జరిగిందో ఏమో కానీ, మళ్లీ ఒంటరిది అయిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ హాట్ బ్యూటీ నయన తారకు ఇండస్ట్రీలో అఫేర్స్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. అప్పట్లో తమిళ సూపర్ స్టార్ సింభూతో ఆడి..పాడి..ముద్దు ముచ్చటా తీర్చుకుని ఆ తరువాత పెళ్లి దగ్గరకు వచ్చే సమయానికి సైడ్ అయిపోయింది.
ఇక ఆ తరువాత ప్రముఖ డ్యాన్స్ మాస్టెర్ ప్రభు దేవ తో వ్యవహారం నడిపి దాదాపుగా పెళ్లి చేసుకునే వరకూ తీసుకు వచ్చి, అక్కడ ప్రభూకి హాండ్ ఇచ్చింది. సరే ఏదో వయసులో ఉంది కదా, తెలియక అలా చేసింది అనుకుందాం అని సరిపెట్టుకునే లోగా దర్శకుడు విగ్నెశ్ తో కాస్త చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ, సెల్ఫీలు దిగుతూ పండగ చేసుకుంది. అయితే ఆ కధ కూడా కొన్నాళ్ళె సాగడంతో విగ్నెశ్ కు కూడా గుడ్ బై చెప్పేసి ఒంటరిగా ఉంటుంది.
అదే క్రమంలో ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాలపై పెట్టిందట…ఇక సినిమాల విషయానికి వస్తే తమిళ ఇండస్ట్రీలో ఈ భామ ఇప్పుడు లక్కీ హీరోయిన్. వరుస సినిమాకు చేస్తుంది. కోలీవుడ్ లో ఆమెను టచ్ చేసే వారే లేరు అంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా…ఈ వ్యవహారాలన్నీ.. మాని…ఇప్పటికైనా ఈ భామ పెళ్లి చేసుకుంటే అందరికీ మంచిది అంటున్నారు తమిళ తంబీలు.