మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు అంటే కత్తులు, గన్నులు కామన్. ఇది ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్లుగా మన సినిమాల్లో గన్నులు చూస్తున్నాం. అయితే అవి పిస్టోల్ నుండి మెషీన్ గన్ వరకు చాలా రకాల గన్స్ మనం చూశాం. అయితే ఏ ముహూర్తాన ‘ఖైదీ’ సినిమాలో కార్తి క్లైమాక్స్ ఎపిసోడ్లో మెషీన్ గన్ పట్టి రెచ్చిపోయాడో కానీ… అప్పటి నుండి ఆ గన్ మన సినిమాల్లో మాస్ ఎలిమెంట్‌కి బాప్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ గన్ సైజ్ సినిమా సినిమాకూ పెరుగుతోంది.
సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టి అక్కడి స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కించిన చిత్రం (Anilmal) ‘యానిమల్’. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అందులో ఓ పెద్ద మెషీన్ గన్ కనిపించింది. చూస్తుంటే అది ఓ కారు అంత కనిపిస్తోంది. దీంతో మెషీన్ గన్స్ గురించి చర్చ పెద్ద ఎత్తున మళ్లీ సాగుతోంది. మన మాస్, యాక్షన్ సినిమాలకు ఆ గన్ సెంటిమెంట్‌గా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కార్తి ‘ఖైదీ’ తీసిన లోకేశ్ కనకరాజే ఆ తర్వాత ‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్‌తో ఇంకా పెద్ద మెషీన్ గన్ పట్టించి విధ్వంసం సృష్టించాడు. ఆ సినిమా కూడా తొలి సినిమాలా బ్లాక్‌బస్టర్ అయింది. ఇక ‘కేజీయఫ్’ సినిమాలో యశ్ – ప్రశాంత్ నీల్ కలసి మెషీన్ గన్‌పై ఎలా అదరగొట్టారో మనం చూశాం. టాలీవుడ్‌లో అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి కూడా అదే పని చేశారు. మొన్నటికి మొన్న ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో విశాల్ కూడా మెషీన్ గన్స్‌తో రెచ్చిపోయాడు.
చూస్తుంటే ఈ మెషీన్ గన్ మేనియా ఇంకా చాలా దూరం వెళ్లేలా ఉంది. అంతెందుకు ‘భగవంత్ కేసరి’ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ గన్ ప్రస్తావన తెచ్చాడు. ‘ఈ గన్ను మార్కెట్‌లో పాపులర్ అని అవతలి వ్యక్తి అంటే.. మనకి ఈ సౌండ్ సరిపోదు’ అంటూ బాలయ్య గ్యాస్ సిలిండర్లను ప్రయోగించాడు. సో… మెషీన్ గన్‌ని మించి కూడా వచ్చే అవకాశ ఉంది.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!