రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకుంటున్న ‘2.0’

రజనీ కాంత్ – శంకర్ కంబినేషన్లో వచ్చిన ‘2.0’ చిత్రం జోరు ఇంకా తగ్గలేదని చెప్పాలి. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా మంచి కలెక్షన్లను రాబడుతూనే ఉంది. రోజుకో కొత్త రికార్డును సొంతం చేసుకుంటుంది ‘2.0’. తాజాగా మరో రికార్డు ను తన కాతాలో వేసుకుంది.

కర్ణాటకలో ఈ చిత్రం 15 రోజులు పూర్తయ్యేసరికి 45 కోట్ల వరకు వసూలు చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 50 కోట్ల వరకూ వసూళ్ళు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని చైనాలో 56 వేల స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. ఇక అక్కడ ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus