Allu Arjun: అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన బన్నీ!

కొన్ని నెలల క్రితం దర్శకుడు బుచ్చిబాబు పుష్ప సినిమాను కేజీఎఫ్ సినిమాతో పోల్చడం గురించి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. అయితే పుష్ప ది రైజ్ రిలీజైన తర్వాత పలు భాషల్లో కేజీఎఫ్ సినిమా సాధించిన రికార్డులను బ్రేక్ చేయడం గమనార్హం. పుష్ప రిలీజైన సమయంలో నెగిటివ్ టాక్ వచ్చినా మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేసి ఈ సినిమా సక్సెస్ కావడానికి పరోక్షంగా కారణమయ్యారు. పుష్ప ది రైజ్ 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

పుష్ప ది రైజ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో కేజీఎఫ్ మొత్తం కలెక్షన్లను తొలిరోజే బ్రేక్ చేసిన పుష్ప బాలీవుడ్ కలెక్షన్లను మించి కలెక్షన్లు సాధించడం గమనార్హం. బాలీవుడ్ హీరోల సినిమాల స్థాయిలో పుష్ప ది రైజ్ అక్కడ సక్సెస్ సాధించింది. పుష్ప ది రైజ్ సక్సెస్ వల్ల మరిన్ని తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ కానున్నాయి.

డబ్బింగ్ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన బన్నీ బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాలో నటిస్తే మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని చెప్పవచ్చు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నైజాంలో కూడా పుష్ప ది రైజ్ ఆల్ టైమ్ రికార్డులను సృష్టించిందని తెలుస్తోంది. తొలి పాన్ ఇండియా సినిమాతోనే బన్నీ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.

ప్రభాస్, యశ్, బన్నీ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోగా ఎంతమంది సౌత్ ఇండియా హీరోలు ఈ జాబితాలో చేరతారో చూడాల్సి ఉంది. చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటారని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus