KGF2 Movie: కేజీఎఫ్2 ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరిందిగా!

ఈ ఏడాది థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో కేజీఎఫ్2 సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. రాకీభాయ్ పాత్రకు తను తప్ప మరే హీరో న్యాయం చేయలేరనేంత అద్భుతంగా యశ్ నటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓర్ మ్యాక్స్ పవర్ రేటింగ్ లో ఈ సినిమా 90 ప్లస్ స్కోర్ ను సాధించడం గమనార్హం.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఓర్ మ్యాక్స్ పవర్ రేటింగ్స్ లో ఈ సినిమా 90ప్లస్ స్కోర్ ను సాధించింది. ఈ స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకున్న తొలి సినిమా కేజీఎఫ్2 కావడంతో ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో విడుదలైన సినిమాలలో ఒకటైన కేజీఎఫ్2 8.5 ఐఎండీబీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన కేజీఎఫ్2 హిందీలో మాత్రం 430 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

మరోవైపు యశ్ తర్వాత ప్రాజెక్ట్ ల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ సినిమాలో యశ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

సలార్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ప్రభాస్ ఖాతాలో ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus