కన్నడకి చెందిన దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే…. పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తండ్రి అయిన రేవనాథ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పునీత్ మరణించిన కొన్ని నెలల్లోనే అతని మామగారు కూడా మరణించడంతో.. అతని కుటుంబం బాగా డిస్టర్బ్ అయ్యింది. పునీత్ మరణ వార్తతో అతని మామగారు రేవనాథ్ గారు చాలా డిజప్పాయింట్ అయ్యారు. అతని కూతురి కుటుంబం గురించి దిగులుపడి ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఆయనకి నిన్న ఉదయం మళ్ళీ హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన్ని వెంటనే బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. రేవనాథ్ వయస్సు 78 ఏళ్ళు. అయినప్పటికీ ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండేవారట.నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా.. అలియాస్ NHAIకి చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు రేవనాథ్. కర్ణాటకలోని ఫేమస్ టూరింగ్ స్పాట్ అయిన చిక్‌మగళూరు జిల్లా మూడిగెరె తాలూకాకు చెందిన వ్యక్తి రేవనాథ్ గారు.
పునీత్ లానే రేవనాథ్ గారు కూడా మరణానతరం తన కళ్లను దానం చేశారు.కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన చివరి సినిమా ‘జేమ్స్’ ను… మార్చి 17న విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తుంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!